ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి కారు బానెట్‌పై లాక్కెళ్లాడు.. షాకింగ్ వీడియో

63చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను వేగంగా ఢీకొట్టి కారు బానెట్‌పై 100 మీటర్ల వరకు లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్రిజేంద్ర సింగ్ తనిఖీల్లో భాగంగా అటుగా వస్తున్న ఓ కారును ఆపాడు. అయితే, కారు డ్రైవర్ ఆపకపోగా కానిస్టేబుల్‌ని ఢీకొట్టాడు. కానిస్టేబుల్ బానెట్‌పై పడిపోగా దాదాపు 100 మీటర్లు లాక్కెళ్లాడు.

సంబంధిత పోస్ట్