భారీ వర్షం.. నదులను తలపిస్తున్న రహదారులు (Video)

75చూసినవారు
ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. కాగా, రాబోయే రెండు గంటల్లో రాజధానిలో భారీ వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అదేవిధంగా జులై 28వ తేదీ వరకూ రాజధానిని వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్