బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే విశాఖ, విజయనగరం, తూ.గో, ప.గో జిల్లాలకు వరదలు వచ్చే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పరీవాహక నదులు ఉప్పొంగే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.