దేశవ్యాప్తంగా మరికొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. నాలుగైదు రోజుల పాటు దక్షిణ-మధ్య భారతదేశంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, అండమాన్ & నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, బిహార్, జార్ఖండ్‌తో సహా తూర్పు, ఈశాన్య భారతదేశంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.