జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుంది. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్లో, బందిపొరా జిల్లాలోని అప్పర్ రీచెస్లో, గురెజ్, తులైల్, కంజల్వాన్లలోని సరిహద్దు ఏరియాల్లో భారీగా మంచు కురుస్తున్నది. చల్లని మంచు తెంపరులు కురుస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. బందిపొరా జిల్లాలో తెల్లటి మంచు దుప్పటి కప్పుకోవడంతో కశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి.