‘కల్కి’ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన హీరో సిద్ధార్థ్‌

63చూసినవారు
‘కల్కి’ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన హీరో సిద్ధార్థ్‌
‘కల్కి’ సినిమాలో ప్రభాస్‌ పాత్ర అద్భుతమని హీరో సిద్ధార్థ్‌ కొనియాడారు. తాజాగా ఓ పోస్ట్‌ పెట్టిన ఆయన కల్కి’ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘నాకు ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. ఇందులో భైరవా నాకు ఎప్పటికీ ఇష్టమైన పాత్రగా మిగిలిపోతుంది. కర్ణుడుగా ఆయన నటన అద్భుతం. నాగ్‌ అశ్విన్‌ బాగా చిత్రీకరించారు. ఇది ఈ తరంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్‌. గొప్ప సినిమా కాబట్టే ఆ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుంది’ అని సిద్ధార్థ్‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్