సినిమా షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్!

54చూసినవారు
సినిమా షూటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్!
ఏపీ ఎన్నికల ముందు నుంచి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. జనసేన అధినేత పూర్తిగా రాజకీయాల మీదే ఫోకస్ పెట్టి ఏపీలో సంచలనం సృష్టించారు. అయితే పవన్ సినిమాలు షూటింగ్‌ జరగక ఆగిపోయాయి. ఈ క్రమంలో పవన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. చాలా నెలల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం సమీపంలో మూవీ బృందం షూటింగ్ సెట్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొనట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్