చుట్టూ భారీ వరద.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రి భవనం ఎక్కారు (వీడియో)

75చూసినవారు
అగ్రరాజ్యం అమెరికాను ‘హెలెన్ హరికేన్’ వణికిస్తోంది. ఈ భారీ తుపాను విధ్వంసం వల్ల ఇప్పటి వరకు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను ధాటికి వరదలు పెరిగి నీరు ఏరులై పారుతోంది. ఈ నేపథ్యంలో టేనస్సీలోని ఈశాన్య భాగంలో ఉన్న యునికోయ్ కౌంటీ హాస్పిటల్ వరద నీటిలో చిక్కుకుంది. ఆస్పత్రి కింది భాగం నీటిలో మునిగిపోవడంతో దాదాపు 50 మందికి పైగా రోగులు, సిబ్బంది టెర్రస్‌ పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్