TG: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇది మహానగరానికి పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి సారించారు. ప్రాంతాల వారీగా సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణను సిద్ధం చేసి కసరత్తు ప్రారంభించారు. ఆక్రమణలు, మలుపుల వద్ద దారి సక్రమంగా లేకపోవడం, ఇంజినీరింగ్ సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలను క్షేత్రస్థాయిలో మరోసారి గుర్తిస్తున్నారు.