
ఏపీలో భారీగా పెరుగుతున్న హైపటైటిస్ వైరస్ కేసులు
ఏపీలో హెపటైటిస్-బీ, సీ వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2197 మందికి పరీక్షలు నిర్వహించగా, 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఆందోళన కలిగిస్తోంది. బాధితులను అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. హైపటైటిస్ B,C వైరస్ కాలేయం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.