హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేయడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. AI ఫోటోలు, వీడియోలను ప్రచారం చేయడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఫేక్ అని తెలిశాక కూడా ఆ పోస్టులను తొలగించలేదని అధికారులు సీఎంతో చెప్పారు. ఫేక్ వీడియో లను కట్టడి చేసేందుకు సైబర్ క్రైం స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.