భారత ప్రభుత్వం తాజాగా నాలుగు రాష్ట్రాల్లో కలిపి 93,000 టన్నులకు పైగా ఇన్-సిటు యురేనియం వనరులు గుర్తించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 60,659 టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది. మిగతా వనరులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నా, ఏపీ ఒక్కటే దాదాపు మొత్తం వనరుల్లో 65% వరకు కలిగి ఉంది. ఈ వనరులు భవిష్యత్తులో దేశానికి అవసరమైన అణుశక్తి ఉత్పత్తికి ఉపయోగపడే అవకాశముందని అంచనా.