లోక రక్షణ కోసం శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తాడు. అలా త్రేతాయుగంలో మహా విష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు. దశరథ మహారాజు, కౌసల్య దేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని చెబుతారు. 14 ఏళ్ల అరణ్యవాసం చేసి పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెప్తారు. అందువల్ల శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు.