ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు!

64చూసినవారు
ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు!
శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఒంటిమిట్టలోని ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏర్పాట్లపై టీటీడీ జీఈవో సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. తలంబ్రాల పంపిణీ కోసం 16 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్