జనవరి 10న భక్తులకు హైదరాబాద్ హిమాయత్నగర్, జూబ్లీహిల్స్ ఆలయాల్లో శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు సోమవారం టీటీడీ హైదరాబాద్ ఏఈవో యు. రమేష్ తెలిపారు. వైకుంఠద్వార దర్శనం జనవరి 10వ తేదీ తెల్లవారుజామున 3. 30 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రికి ముగుస్తుందని తెలిపారు. జనవరి 10 నుండి 12 వరకు మూడు రోజుల పాటు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.