బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో దిగంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ఎన్టి రామారావు బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు రామారావు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతిలో పుట్టడం ఘనత అయితే ఆయన పుట్టిన తెలుగుజాతిలోనే మనము పుట్టడం గొప్ప విషయమని అన్నారు.