పిల్లలతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (వీడియో)
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాపట్లలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీట్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు సరదాగా పాల్గొన్నారు. ఇంకా పిల్లలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ భోజనం చేశారు.