అవమానం భరించలేక చున్నీతో ఉరి వేసుకున్న విద్యార్థి

56చూసినవారు
అవమానం భరించలేక చున్నీతో ఉరి వేసుకున్న విద్యార్థి
TG: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గంలోని నారాయణ హైస్కూల్‌లో టీచర్ 10వ తరగతి చదువుతున్న బాలు అనే విద్యార్థిని గోడ కూర్చీ వేయించారు. దీంతో అవమానం భరించలేక ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మాహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలును ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ధృవీకరించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్