విద్యా శాఖని నేను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానని నారా లోకేష్ అన్నారు. ఏపీలోని బాపట్లలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. 'గత ఐదేళ్లుగా దారి తప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం చంద్రబాబు నన్ను ఆదేశించారు. ఎందుకు విద్యాశాఖ తీసుకున్నావని నన్ను చాలా మంది అడిగారు. ఈ శాఖకు నా అవసరం చాలా ఉంది, ఒక ఛాలెంజ్‌గా తీసుకుని విద్యావ్యవస్థను సెట్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా' అని అన్నారు.