లగచర్లలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజభవన్ ముట్టడించారు. విద్యార్థి సంఘం నాయకుడు వెంకట్ బంజారా ఆధ్వర్యంలో పలువురు విద్యార్థిని విద్యార్థులు రాజబాబు వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అడ్డగించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.