ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో రాజ్యాంగానిదే కీలక పాత్ర: మంత్రి లోకేశ్‌

52చూసినవారు
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో రాజ్యాంగానిదే కీలక పాత్ర: మంత్రి లోకేశ్‌
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మనదేశంలో.. భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో భారత రాజ్యాంగానిదే కీలక పాత్రని కొనియాడారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్