గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.