వరదలోనూ సాహసం నిజమైన హీరోలు అంటే వీరే...

67చూసినవారు
వరదలో హైదరాబాద్ యువత రిస్క్ చేసి నలుగురిని కాపాడారు. ముషీరాబాద్ పరిధి రాంనగర్ స్ట్రీట్ నెంబర్ 17లో వరద ఉదృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో నలుగురు ప్రయాణికులు అందులోనే ఇరుక్కుపోయారు. స్థానిక యువకుడు ప్రవీణ్ యాదవ్, అతడి స్నేహితులు రిస్క్ చేసి కారును గోడ పక్కకు తెచ్చారు. అద్దాలను పగులగొట్టి అందులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. నిజమైన హీరోలు అంటే వీరే అంటూ ప్రజలు ప్రసంశలు కురిపిస్తున్నారు.