హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను వెంటనే చెల్లించాలని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కురెళ్ళ మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు మరణిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం అని అన్నారు. 24 గంటల్లో మెస్ చార్జీలను విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.