ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు వినియోగించుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. మంగళవారం లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ బాలానగర్ ఆధ్వర్యంలో బోయినపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉచితంగా వైద్య సేవలు అందించడం మంచి విషయమని నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఇటువంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు.