వొడాఫోన్‌ ఐడియా నష్టం రూ.7,176 కోట్లు

67చూసినవారు
వొడాఫోన్‌ ఐడియా నష్టం రూ.7,176 కోట్లు
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.7,176 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ఈ మేరకు తాజాగా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రకటించిన రూ.8,746.6 కోట్లతో పోలిస్తే నష్టాలు స్వల్పంగా తగ్గాయి. గత త్రైమాసికంతో (రూ.6432 కోట్లు) పోల్చినప్పుడు మాత్రం నష్టాలు పెరగడం గమనార్హం. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.10,716 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.10,932 కోట్లకు పెరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్