గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్, ప్యాట్నీ, జేబీఎస్, కార్ఖానా, మారేడ్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, లోతుకుంట, బొల్లారం తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామైంది.