

తాడేపల్లిగూడెంలో చిరుత పులి కలకలం! (video)
తాడేపల్లిగూడెంలోని సింగూలూరి వారి వీధిలో చిరుత పులి కనిపించిందన్న వార్త కలకలం రేపింది. చెట్ల మధ్య సంచరిస్తున్న చిరుతను పోలిన జంతువు జామాయిల్ చెట్టుపై నుంచి కిందకు దూకిందని, కుక్కలు గట్టిగా అరవడంతో అక్కడకు వచ్చి చూశామని స్థానికులు చెప్తున్నారు. అంతేకాక, రెండు రోజుల క్రితం అదే ప్రాంతంలో ఒక కుక్క మృతదేహం కనపడిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.