AP: ఉత్తరాంధ్రలో ఇవాళ సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని పేర్కొంది. ఉత్తరాంధ్రలో ఇవాళ, రేపు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని APSDMA కూడా పేర్కొన్న విషయం తెలిసిందే.