AP: రాష్ట్రంలోని ప్రజలు ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో అయితే వాతావరణం ఊహించని విధంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. శవిశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ప్రజలు పొలాల్లో, చెట్ల కింద ఉండవద్దని అధికారులు సూచించారు.