స్టార్టప్ బ్యాంకు అయిన స్లైస్ బ్యాంక్ భారత్‌లోనే తొలి న్యూ సేవింగ్స్ ఖాతాను ప్రకటించింది. ప్రతిరోజూ వడ్డీ లభించడం దీని ప్రత్యేకత. ఇది 100% రేపో రేటుతో అనుసంధానంగా ఉంటుందట. అంటే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించే రేటుకి అనుగుణంగా వడ్డీ లభిస్తుంది. ఇది దేశంలో సరికొత్త ఇన్నోవేషన్. ఇప్పటివరకు సేవింగ్స్ ఖాతాల్లో నెలలకో లేదా సంవత్సరానికో వడ్డీ లభించేది. ఈ కొత్త విధానం ద్వారా ఇకపై ప్రతీరోజూ వడ్డీ పొందవచ్చు.