ప్రయాణికులకు స్థానిక రుచులను పరిచయం చేయడానికి రూట్ ఆధారంగా ప్రాంతీయ వంటకాలను అందించే కొత్త కార్యక్రమాన్ని భారత రైల్వే ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఫస్ట్ సదరన్ రైల్వేల్లో పైలట్ ప్రోగ్రాంగా ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ప్రదేశాన్ని బట్టి ప్రయాణికులకు అక్కడి స్థానిక వంటకాలను అందించనున్నారు. తమిళనాడులో వందే భారత్ రైలులో సౌత్ రుచులు లేకపోవడంపై ప్రశ్నించిన ఎంపీ సుమతి వ్యాఖ్యలతో ఈ అంశం చర్చనీయాంశమైంది.