తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన

65చూసినవారు
తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన
తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణం కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. 7, 8 తేదీల్లో  జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురుస్తుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్