
పీ4కి స్పందన.. రూ.10 కోట్లు వితరణ
ఏపీ సీఎం చంద్రబాబు పీ4 పిలుపుతో మంచి స్పందన లభిస్తోంది. కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్ ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.10 కోట్ల విరాళాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కాకుమానులో 5,315 ఎకరాలకు సాగునీటి సరఫరా స్థిరంగా ఉండనుంది. ఈ సందర్భంగా సీఎం కారుమంచి ప్రసాద్‌ను అభినందించారు.