కల్లు దొరకలేదని.. నిమ్స్ ఆసుపత్రి పైనుంచి దూకిన వ్యక్తి

68చూసినవారు
కల్లు దొరకలేదని.. నిమ్స్ ఆసుపత్రి పైనుంచి దూకిన వ్యక్తి
TG: కల్లు దొరక్కపోవడంతో ఓ వ్యక్తి నిమ్స్​ హాస్పిటల్​ బిల్డింగ్​పై నుంచి దూకి మరణించాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హనుమండ్ల నారాయణ(55) తన తండ్రి పోషంకి వైద్య చికిత్స అందించేందుకు ఈ నెల 2న నిమ్స్‌కి వచ్చారు. ఆయనకు కల్లు సేవించే అలవాటు ఉంది. 3 రోజులుగా ఆస్పత్రిలోనే ఉండటం, కల్లు తాగకపోవడంతో వింతగా ప్రవర్తించాడు. శుక్రవారం కిటికీ నుంచి కిందికి దూకాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్