2047 నాటికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఓ వ్యాపారవేత్త ఉండాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి నారాయణ అన్నారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన మెప్మా వన్ డే వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 30 వేల మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళికను ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్నా డేటా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు.