
రేపటి నుంచి వారికి ఉచిత బస్సు
AP: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్. సోమవారం నుంచి రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంగ్లీష్ మీడియం, ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో వచ్చే పరీక్షల్నీ వచ్చే నెల 1 వరకూ నిర్వహించనున్నారు. ఉ.9.30 నుంచి మ.12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ ఆధారంగా విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. రేపటి నుంచి టెన్త్ విద్యార్థులు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరు కానున్నారు.