జగన్‌వి మైండ్ గేమ్ పాలిటిక్స్: సోము వీర్రాజు

62చూసినవారు
జగన్‌వి మైండ్ గేమ్ పాలిటిక్స్: సోము వీర్రాజు
AP: వైసీపీ అధినేత జగన్ సాగిస్తున్న మైండ్ గేమ్ పాలిటిక్స్‌కు రాష్ట్రంలో చోటు లేదని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శనివారం తూ.గో జిల్లా అనపర్తి మండలం రామవరంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాననటం పొలిటికల్ స్టంట్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి జగన్‌కు తెలిసినా.. మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్