AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపేలా ఈ ట్వీట్ ఉంది. ‘ఉత్తరాదిన ఉన్న హిమాలయాల్లో ‘పరమశివుని’ కైలాసం ఉంది. దక్షిణాదిన ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం ఉంది. వారు వెలిసి ప్రదేశం ఈ భారతదేశం. ఇది జగన్మాత ఆదేశం.’ అని పేర్కొన్నారు. అయితే ఉత్తర, దక్షిణాదికి ఎలాంటి తేడా లేదని, భారతదేశం ఒక్కటేనని చెప్పేందుకే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.