యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. రూ.4 లక్షలు పైగా చోరీ

71చూసినవారు
యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. రూ.4 లక్షలు పైగా చోరీ
AP: విజయవాడలో ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు యజమాని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చేశారు. అది చూసి ఒకరు ఇల్లు నచ్చిందని తాను ఆర్మీలో పని చేస్తున్నానని చెప్పి అడ్వాన్స్ చెల్లిస్తాను అని క్యూఆర్‌ కోడ్‌ పంపాడు. దాన్ని స్కాన్‌ చేస్తే డబ్బులు మీకు జమవుతాయని నమ్మించాడు. అది నమ్మి క్యూఆర్‌ కోడ్‌ను ఇంటి యజమాని స్కాన్‌ చేశారు. క్షణాల్లో రూ.4.34 లక్షలు ఖాతా నుంచి డెబిట్‌ అయినట్లు మొబైల్‌కు మెసేజ్ రావడంతో మోసపోయాడని తెలిసొచ్చింది.

సంబంధిత పోస్ట్