AP: తిరుపతి శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలికను తోటి విద్యార్థిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసేయడంతో.. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను పాడిపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థినిగా గుర్తించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి స్కూల్ యాజమాన్యం గోప్యంగా చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.