అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అస్వస్థత
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్(78) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. క్రిస్మస్ నాటికి ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు (1993-2001) సేవలందించారు.