నేడు పోలీస్‌ల విచారణకు అల్లు అర్జున్?

82చూసినవారు
నేడు పోలీస్‌ల విచారణకు అల్లు అర్జున్?
TG: సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు అందించిన విషయం తెలిసిందే. బన్నీ మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో బన్నీ మధ్యంతర బెయిల్ పొందారు. అయితే పోలీసుల నోటీసులపై ఆయన తన లీగల్ టీంతో చర్చించారు. ఇవాళ విచారణకు హాజరవుతారో, లేదో కొద్ది గంటల్లో తెలియనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్