TG: హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ పెద్ద చెరువులో 13 విల్లాలను శుక్రవారం హైడ్రా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదికలో వెల్లడించింది. విల్లాల నిర్మాణాలు FTL, బఫర్ జోన్లలో ఉన్నాయని అనుమతులు రద్దు చేసినప్పటికీ కొనసాగడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉండగా, కోర్టుకు సమాచారం ఇచ్చి కూల్చేశారు.