సింగర్ శ్రేయ ఘోషల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన మధురమైన గొంతుతో వందల పాటలు పాడి సినీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఇప్పటికే కొన్ని వందల పాటలు పాడారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటమ్ సాంగ్స్ పాడేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. అలాగే చిన్న పిల్లలు అలాంటి పాటలు పాడటం తనకు ఇష్టం లేదని చెప్పారు.