'మైసూరు పాక్' పేరుకు ఉన్న చరిత్ర ఇదే

68చూసినవారు
'మైసూరు పాక్' పేరుకు ఉన్న చరిత్ర ఇదే
1902 నుంచి 1940 వరకు మైసూరును పాలించిన కృష్ణారాజ వడయార్‌కు భోజనాలంటే చాలా ఇష్టం. రాజుకు కొత్త రకం వంట చూపిద్దామని వంటమనిషి కాకాసుర మడప్ప.. శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు కలిపి ఒక స్వీట్ తయారు చేశాడు. ఆ రుచి రాజుకు నచ్చడంతో దాని పేరేంటని అడిగాడు. దీంతో మడప్పకు ఏం చెప్పాలో తెలియక పంచదార "పాకం"లో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి దానితో పాటే తమ రాజ్యం పేరు వచ్చేలా "మైసూరు పాక" అని చెప్పాడు. అదే తర్వాతి కాలంలో " "మైసూర్ పాక్" గా మారింది.

సంబంధిత పోస్ట్