తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని ఉదయాన్నే తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో తమలపాకులు సమర్థవంతంగా పని చేస్తాయి. తమలపాకులు మన శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. తమలపాకులను పరిగడుపున తినడం వల్ల జీర్ణ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.