కన్నడ నటుడు డాలీ ధనంజయ పెళ్లికి సిద్ధం అయిపోయాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ధన్యత అనే డాక్టర్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం ఉందట. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవచ్చని తెలుస్తోంది.