బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్కు హత్య బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన మహేశ్ పాండేగా గుర్తించారు. నిందితుడికి ఏ గ్యాంగ్తోనూ సంబంధాలు లేనట్లు తెలుస్తోంది. కానీ, గతంలో కొందరు ప్రభావిత వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. ఈ బెదిరింపులకు పాల్పడింది తానేనంటూ అతడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.