ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున పచ్చి కొబ్బరి ముక్కను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిలో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం ఉంటాయి. పచ్చి కొబ్బరి తింటే సులభంగా బరువు తగ్గొచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపరిచి.. ఏకాగ్రతను పెంచుతుంది. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.